Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంతరిక్షంలో రహస్య పరిశోధనలు చేసి తిరిగొచ్చిన అమెరికా వ్యోమనౌక!

  • ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రంలో దిగిన నౌక
  • 780 రోజుపాటు భూకక్ష్యలో సంచారం
  • వివరాలు మాత్రం వెల్లడించని అగ్రరాజ్యం
అమెరికా ఏది చేసినా ప్రపంచానికి ప్రత్యేకమే. అందుకు కారణం కూడా ఆ దేశం అనుసరించే పోకడలే. మూడో కంటికి తెలియకుండా చాలా ఆపరేషన్స్‌ నిర్వహించడం ఆమెరికాకు అలవాటు. ఇప్పుడు కూడా అటువంటి ఆపరేషన్‌నే పూర్తి చేసింది.

అంతరిక్షంలో తనకు కావాల్సిన రహస్య పరిశోధనలకు రెండేళ్ల క్రితం ఏకంగా ఎక్స్‌-37బి అనే వ్యోమనౌకను ప్రయోగించింది. 2017లో ప్రయోగించిన ఈ వ్యోమనౌక దాదాపు 780 రోజులపాటు భూకక్ష్యలో పరిభ్రమించి తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని తిరిగి ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రంలో సేఫ్‌గా ల్యాండ్‌ అయ్యింది. అయితే ఈ నౌకద్వారా అమెరికా ఏం సాధించింది, ఏ వివరాలు సేకరించిందన్న విషయాన్ని మాత్రం పెద్దన్న బయట పెట్టడం లేదు.

అంతరిక్షంలోకి పంపిన పునర్వినియోగ వాహక నౌకకు సంబంధించి ఇది రికార్డు కాలమని, తమ లక్ష్యాలన్నీ నెరవేరాయని మాత్రం అమెరికా ప్రకటించింది. ఓ స్పేస్ షటిల్‌లా ఉండే ఈ వ్యోమనౌకను ఇప్పటి వరకు రోదసిలోకి ఐదుసార్లు పంపించారు. వచ్చే ఏడాది మరోసారి ప్రయోగించనున్నారని సమాచారం. కాగా, తాజా ప్రయోగంలో అమెరికా తన వైమానిక దళ లేబొరేటరీకి సంబంధించిన కొన్ని ప్రయోగాలు చేసిందని తెలుస్తోంది.
America
space vehicle
airforce

More Telugu News